English | Telugu

నితిన్ సమంతల ‘అ.. ఆ’

నితిన్ సమంతలతో త్రివిక్రమ్ చేయబోయే సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశాడు. అదేంటంటే.. ‘అ.. ఆ’. చాలా చిత్రంగా ఉంది కదా టైటిల్. దీనికి ఓ ట్యాగ్ లైన్ కూడా ఉందండోయ్. అనసూయ రామలింగం వెర్సస్ ఆనంద్ విహారి. సమంతకు తోడుగా మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేసారు. ప్రేమమ్ సినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ఛాయాగ్రహణం అందించబోతుండటం విశేషం. రాధాకృష్ణ తమ హారిక హాసిని బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తన కొత్త సినిమాకు కొంచెం డిఫరెంట్ టైటిల్ పెట్టి ఆసక్తి రేపాడు త్రివిక్రమ్. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందేమో లేదో చూడాలి.