English | Telugu

చాలా థాంక్స్.. ఇక నుంచి సినిమా వాళ్ళు వాటికి ప్రమోషన్ చెయ్యరు

తెలుగు, హిందీ, తమిళ సినిమాలని రహస్యంగా రికార్డ్ చేసి, ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మకాలు జరుపుతు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పైరసీ ముఠాని రీసెంట్ గా హైదరాబాద్(Hyderabad Police)పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం ఐదుగురు కీలక నిందితులని అరెస్టు చెయ్యడంతో పాటు, వారి వద్ద నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ పరికరాలు తదితర సాంకేతిక పరికరాలని స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషయంపై రీసెంట్ గా ప్రముఖ నిర్మాత తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు 'దిల్ రాజు'(Dil Raju)మాట్లాడుతు పైరసీ భూతగాళ్ళని పట్టుకున్న హైదరాబాద్‌ పోలీసులకి ధన్యవాదాలు, టెక్నాలజీతో పాటు నేరాలూ పెరుగుతున్నాయి. పైరసీతో ప్రభుత్వ ఆదాయానికి కూడా నష్టం కలుగుతోంది. హైదరాబాద్‌ని సినిమా హబ్‌గా చేయాలని సీఎం అన్నారు. ఇకపై సినీ పరిశ్రమ నుంచి ఎవరు బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ చేయరని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. దిల్ రాజు ప్రస్తుతం నిర్మాతగా తన హవా కొనసాగిస్తూనే పంపిణి దారుడిగాను పలు హిట్ సినిమాలని ప్రేక్షకులకి అందిస్తున్నాడు. రీసెంట్ గా 'ఓజి'(OG)ని తెలంగాణతో పాటు ఉత్తరాంధ్ర లో దిల్ రాజు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.