English | Telugu

చిరంజీవి, చరణ్ ని  బీట్ చేసిన ఎన్టీఆర్ 

సెప్టెంబర్ 27 కి ముహూర్తం దగ్గర పడే కొద్దీ ఎన్టీఆర్ అభిమానుల్లో,ప్రేక్షకుల్లో దేవర(devara)ఫీవర్ ఏ రోజుకా రోజు పెరిగిపోతుంది. చాలా ఏరియాల్లో మిడ్ నైట్ షోస్ కూడా పడబోతున్నాయి.వాటికి సంబంధించిన టికెట్స్ కూడా ఇప్పటికే అయిపోయాయనే టాక్ కూడా వినపడుతుంది. తాజాగా దేవర ముంగిట ఒక అరుదైన రికార్డు వచ్చి చేరింది.


ఒవర్సీస్ అడ్వాన్స్‌ బుకింగ్ విషయంలో దేవర పెద్ద ప్రకంపనలనే సృష్టిస్తుంది. ఫస్ట్ డే కి సంబంధించి ఒన్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి రిలీజ్ కి రెండు వారాలు ముందే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ జోష్ ఇలానే ఉంటే రిలీజ్ నాటికే దేవర అడ్వాన్సు బుకింగ్స్ 3 మిలియన్ దాటవచ్చని ట్రేడ్ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి(chiranjeevi)చరణ్(ram charan)ల కాంబో లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చిన ఆచార్య నార్త్ అమెరికాలో ఫుల్ రన్ 985K డాలర్స్ దగ్గర ఆగిపోయింది.

ఇక ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్,సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అలాగే మూడు సాంగ్స్ కూడా ఒక లెవల్లో ప్రభంజనం సృష్టించడమే కాకుండా రికార్డు వ్యూస్ ని సాధిస్తున్నాయి. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా బాలీవుడ్ స్టార్ న‌టుడు సైఫ్ అలీఖాన్ విల‌న్‌ పాత్రలో కనిపించనున్నాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.