English | Telugu

హిందీ బెల్ట్ లో ఎన్టీఆర్ కి ఎదురులేదన్నారు కదా..కలెక్షన్స్ ల పరిస్థితి ఇదే 

మొత్తం ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైన దేవర(devara)ఫస్ట్ డే నూట డెబ్భై రెండు కోట్ల రికార్డు కలెక్షన్స్ ని రాబట్టి ఎన్టీఆర్ స్టామినా ని మరోసారి చాటి చెప్పింది.దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోతున్నాయి.రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించడం పక్కా అనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్(rrr)తో ఎన్టీఆర్ కి నార్త్ మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడిన విషయం అందరకి తెలిసిందే. ఈ నేపథ్యంలో
ఇప్పుడు దేవర ఎంత మేర కలెక్షన్స్ రాబడుతుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే తొలి రోజు పద్దెనిమిది కోట్లు వసూళ్లు అందుకోగా సెకండ్ డే మరిన్ని కలెక్షన్స్ ని సాధించే దిశగా అడుగులేస్తుందనే టాక్ బాలీవుడ్ సర్కిల్స్ లో వినపడుతుంది.ఇదే కొనసాగితే వీకెండ్ లో ముప్పై కోట్ల రూపాయలని సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

దేవర(devara)ని హిందీలో ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ విడుదల చెయ్యగా సినిమా రిజల్ట్ పట్ల ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే పరిచయమైన జాన్వీ, సైఫ్ అలీ ఖాన్ దేవరలో ఉండటం వల్ల దేవరకి నార్త్ ఇండియాలో మంచి ప్లస్ పాయింట్ గా నిలిచిందని చెప్పవచ్చు.ఇక దేవరతో తనని ఎందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటారో అని ఎన్టీఆర్ నిరూపించాడని మూవీ చూసిన ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో చెప్తున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.