English | Telugu

బాలకృష్ణ కాళ్ళకి ఐశ్వర్యారాయ్ నమస్కరించడానికి కారణం ఇదే

నటసింహం నందమూరి బాలకృష్ణ(balakrishna)అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. వైరల్ చెయ్యడమే కాదు మా బాలయ్య రేంజ్ ఇది అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఐఫా అవార్డుల కార్యక్రమం అబుదాబిలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.ఈ వేడుకకు ఇండియన్ చిత్ర పరిశ్రమకి చెందిన అతిరధ మహారధులు మొత్తం పాల్గొనగా పలు విభాగాలకు సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వాళ్లకి అవార్డులు కూడాఅందివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ మూవీకి గాను ఐశ్వర్యారాయ్(Aishwarya rai) కు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది. ఈ అవార్డును బాలకృష్ణ తన చేతులమీదుగా ఐశ్వర్య కి అందివ్వాల్సి ఉండగా ఆ సమయంలో అవార్డు అందుకునేందుకు స్టేజీమీదకు వచ్చిన ఐశ్వర్య, బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి అవార్డుని తీసుకుంది. దీన్ని బట్టి బాలయ్య పట్ల ఇతర నటులకి ఎంత గౌరవం ఉందో అర్ధం అర్ధం చేసుకోవచ్చు.

ఇక మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)కి ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డు, బాలకృష్ణ(balakrishna)కు గోల్డెన్ లెగసీ అవార్డులు కూడా అందుకోవడం జరిగింది.విక్టరీ వెంకటేష్(venkatesh)కూడా ఈ కారక్రమంలో పాల్గొన్నాడు.ఈ మేరకు ఆ ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.