English | Telugu

నార్త్ అమెరికాలో దేవర ఊచకోత.. ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డులకు ఎసరు!

తనని కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని ఎందుకు అంటారో 'దేవర' (Devara)తో మరోసారి రుజువు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). రేపు (సెప్టెంబర్ 27) థియేటర్లలో అడుగు పెట్టనున్న దేవర మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో సంచలన రికార్డులు సృష్టిస్తోంది.

మరికొద్ది గంటల్లో నార్త్ అమెరికాలో 'దేవర' ప్రీమియర్స్ పడనున్నాయి. ప్రీమియర్ ప్రీ సేల్స్ పరంగా ఇప్పటికే 2.5 మిలియన్ మార్క్ ని అందుకుంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ప్రీమియర్స్ తో 3 మిలియన్ మార్క్ ని అందుకొని.. టాప్-3 లోకి ఎంటర్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు. (Devara USA)

నార్త్ అమెరికా ప్రీమియర్స్ గ్రాస్ పరంగా తెలుగు సినిమాల్లో 3.9 మిలియన్స్ తో 'కల్కి 2898 AD', 3.4 మిలియన్స్ తో 'ఆర్ఆర్ఆర్' టాప్-2 లో ఉన్నాయి. మరి ఆ రెండు సినిమాలను 'దేవర' బీట్ చేస్తుందేమో చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.