English | Telugu
నవంబర్ 29 న దండుపాళ్యం పూజ పెళ్లి..వరుడు ఇతనే
Updated : Nov 28, 2023
దండు పాళ్యం సినిమాతో ప్రేక్షకుల అందర్నీ అలరించిన నటి పూజా గాంధీ. వాస్తవానికి 2001 లోనే చిత్ర రంగ ప్రవేశం చేసిన పూజ దండుపాళ్యం సిరీస్ తో బాగా పాపులర్ అయ్యింది. మూడు సిరీస్ లుగా వచ్చి ఘన విజయం సాధించిన దండుపాళ్యంలో పూజ బోల్డ్ గా నటించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు తాజాగా పూజ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక వార్త సంచలనం సృష్టిస్తుంది.
పూజ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. లాజిస్టిక్స్ కంపెనీ యజమాని అయిన విజయ్ అనే వ్యక్తితో పూజ పెళ్లి నవంబర్ 29 న ఘనంగా జరగనుంది. అతి కొద్దీ మంది అతిధుల సమక్షంలో బెంగుళూర్ లో వారిరువురి వివాహం జరగనుంది. వాస్తవానికి 2012 లోనే పూజకి ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి పెళ్లి పీటలు ఎక్కకుండానే విడిపోయారు. ఆ తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ తో పూజ పెళ్లి జరిగినట్టు రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ అబద్హాలని పూజా చెప్పింది.
కాగా ప్రస్తుతం పూజా వయసు 40 సంవత్సరాలు. సోషల్ మీడియా ద్వారా ఆమె పెళ్లి విషయం తెలుసుకున్న అభిమానులు ,సన్నిహితులు అందరు ఆమెకి పెళ్లి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఇక నైనా పూజ లైఫ్ లో సెటిల్ అవ్వాలని తన నూతన దాంపత్యం కలకాలం నిలవాలని కోరుకుంటున్నారు.