English | Telugu
ఆర్జీవీకి షాక్.. 'మా ఇష్టం' విడుదలపై కోర్టు స్టే
Updated : Apr 7, 2022
అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా 'మా ఇష్టం'. లెస్బియన్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇలాంటి సమయంలో ఆర్జీవీకి ఊహించని షాక్ తగిలింది. సినిమా విడుదలపై కోర్టు స్టే ఇచ్చింది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు రూ.5.29కోట్లు ఇవ్వాలని నిర్మాత నట్టికుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రతి సినిమాకు 50 లక్షలు చొప్పున ఇవ్వాలన్న నిబంధనలను ఆర్జీవీ తుంగలో తొక్కారని నట్టి కుమార్ పిటిషన్ లో పేర్కొన్నాడు. పిటిషన్ ను విచారించిన సిటీ సివిల్ కోర్టు ఆర్జీవీ తీసిన 'మా ఇష్టం' సినిమా విడుదల ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ చిత్రాన్ని ప్రదర్శించినా ప్రదర్శనకు సహకరించినా కోర్టు ధిక్కారణ అవుతుందని నట్టి కుమార్ అన్నారు.
మరి ఆర్జీవీ నట్టికుమార్ తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకొని సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులను తొలగించుకుంటాడేమో చూడాలి.