English | Telugu

పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసిన మెగాస్టార్..!

చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు మెగాస్టార్ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. సినిమాల్లో మెగాస్టార్‌గా రాణించిన చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి తనకున్న సినీ ఇమేజ్ ను కూడా డ్యామెజ్ చేస్కున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు అంటుంటాయి. ఈ విషయం లేటుగా పసిగట్టిన మెగాస్టార్ ఆ డ్యామెజ్ కంట్రోల్ కు సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు రంగం కూడా వేగంగానే సిద్ధ చేసుకొంటున్నారు. ఆయన నటించే 150వ సినిమా మెగాస్టార్‌గా ఆయనకు పూర్వ వైభవం తెచ్చేదిగా ఉండాలని, పెద్ద హిట్‌ అయ్యేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు ముందుగా పవన్ అభిమానులను టార్గెట్ చేశాడట.

గత కొంతకాలంగా చిరు, పవన్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయని మీడియాలో వార్తలు హల్ చల్ చేసిన ఖండించని మెగాస్టార్...తాజాగా వాటికి ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నాలు మొదలుపెట్టారు. లేటెస్ట్ గా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. పవన్ తమ్ముడే కాదు నాకు మరో బిడ్డలాంటి వాడు.. రాజకీయాలకు అతీతమైన బంధం మాది. ఎవరికీ సాధ్యం కాని ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు.. పవన్ - చరణ్ ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నారని అన్నారు. మరి మెగాస్టార్ వేసిన మాస్టర్ ప్లాన్ తో ‘పొలిటికల్‌ ఫెయిల్యూర్‌’ మరుగున పడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే!

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.