English | Telugu

రాజువై న‌డిపించు.. చిరంజీవి పోస్ట్ వైరల్ 

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)పుట్టినరోజు.. అభిమానులకి మాత్రం పండుగ రోజని చెప్పవచ్చు. ఆ మాటకొస్తే అగస్ట్ 22 డేట్ చెప్పగానే, అభిమానులతో పాటు తెలుగు ప్రజలు ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజని చెప్తారు. అంతలా చిరంజీవి లెగసి కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతు వస్తుంది. ఈ విషయంపై రీసెంట్ గా పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ట్వీట్ చేస్తు చిరంజీవి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం గొప్ప అనుభవంతో పాటు వెల కట్టలేని జీవిత పాఠం. అన్నిటిని భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన 'విశ్వంభరుడు'. పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని ట్వీట్ చెయ్యడం జరిగింది.

ఇప్పుడు ఈ ట్వీట్ పై చిరంజీవి స్పందిస్తు జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు, త‌మ్ముడు క‌ల్యాణ్‌
ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి. ప్ర‌తీ మాట‌, ప్రతి అక్ష‌రం నా హృద‌యాన్ని తాకింది. అన్న‌య్య‌గా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో, ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను. నీ కార్య‌దీక్ష‌త‌, ప‌ట్టుద‌ల చూసి ప్ర‌తీ క్ష‌ణం గ‌ర్వ‌ప‌డుతూనే ఉన్నాను. నిన్ను న‌మ్మిన‌వాళ్ల‌కు ఏదో చేయాల‌న్న త‌ప‌నే నీకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త శ‌క్తిని ఇస్తుంది.

ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జన‌సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై న‌డిపించు. వాళ్ల ఆశ‌లకు, క‌ల‌ల‌కు కొత్త శ‌క్తినివ్వు. అభిమానుల‌ ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా ల‌భిస్తూనే ఉండాలి. ఓ అన్న‌య్య‌గా నా ఆశీర్వ‌చ‌నాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్ర‌తీ అడుగులోనూ విజ‌యం నిన్ను వ‌రించాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకొంటున్నాను అని ట్వీట్ చేసాడు.