English | Telugu

చందమామకు సెన్సార్ సర్టిఫికేట్

నరేష్, ఆమని, మంచు లక్ష్మీ, కృష్ణుడు, చైతన్య కృష్ణ, రిచా పనాయ్, కిషోర్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన తాజా చిత్రం "చందమామ కథలు". ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్ ను అందించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఎనిమిది విభిన్న కథలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చక్రి బూనేటి నిర్మించారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.