English | Telugu

మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" ఆడియో రిలీజ్

మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" ఆడియో రిలీజ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే తెలుగు సినీ పరిశ్రమలో ఇంతవరకూ ఏ చిత్రం ఆడియో విడుదల కాని విధంగా మూడు భాషల్లో ఈ మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" ఆడియో రిలీజ్ చేయబడింది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "బిజినెస్ మ్యాన్".

ఈ చిత్రం ఆడియో తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయబడింది. హైదరాబాద్ శిల్పారామంలోని శిల్పకళావేదికపై అశేష అభిమానుల మధ్య మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" తమిళ భాష ఆడియోని మహేష్ బాబు తండ్రి సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేయగా, మళయాళం అపజయమెరుగని యువ దర్శకుడు రాజమౌళి, తెలుగు ఆడియోని శ్రీను వైట్ల మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్" ఆడియో విడుదల వేడుకకు ప్రముఖ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు, అచ్చిరెడ్డి, రమేష్ పుప్పాల, బి.వి.యస్.యన్.ప్రసాద్, దిల్ రాజు, బి.ఎ.రాజు తదితరులు హాజరయ్యారు.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.