English | Telugu

సుబ్రమణ్యానికి మాంచి గిరాకీ

టాలీవుడ్ మొత్తం ఇప్పుడు సుబ్రమణ్యాన్ని ఎంతో అభిమానిస్తోంది. ఇంతకీ సుబ్రమణ్యం అంటే ఎవరూ అనుకుంటున్నారా... ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అనుకుంటున్నారు కదూ... కాదు... ధర్మవరపు సుబ్రమణ్యం అస్సలు కాదు.. ఎందుకంటే పాపం ఆయన మనమధ్య లేరు కదా..! మరింతకీ టాలీవుడ్ అంతగా అభిమానిస్తున్న సుబ్రమణ్యం ఎవరు? ఇక సస్సెన్స్ ఎందుకులెండి... ఆ సుబ్రమణ్యం మరెవరో కాదు... ‘సుబ్రమణ్యం’ అనే సినిమా టైటిల్.

ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో సుబ్రమణ్యం అనే పేరున్న మూడు సినిమాలు విడుదలయ్యాయి. అవి.. ఒకటి ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, రెండు ఎవడే సుబ్రమణ్యం, మూడు సుబ్రమణ్యం ఫర్ సేల్. సుబ్రమణ్యం అని పేరు పెట్టుకున్న మూడు సినిమాలూ హిట్టయ్యాయి. దాంతో సెంటిమెంట్లకి కేరాఫ్ అడ్రస్ అయిన సినిమా ఫీల్డ్‌లో ఇప్పుడు చాలామంది దర్శక నిర్మాతలు సుబ్రమణ్యాన్ని అభిమానించేస్తున్నారు. టైటిల్లో సుబ్రమణ్యం అని పెట్టుకుంటే సినిమా హిట్టవుతుందని నమ్మకాలు పెట్టేసుకున్నారు.

సెట్స్ మీద వున్న రెండు సినిమాలకు ‘సుబ్రమణ్యం’ అనే పేరు కలిసేలా టైటిల్ పెట్టాలని ఆ సినిమాల దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకూ అయిన షూటింగ్‌లో హీరో పేరు మరోలా వున్నా డబ్బింగ్‌లో ‘సుబ్రమణ్యం’ అని మార్చుకునేందుకు కూడా ప్రిపేర్ అయిపోయారట. ఎవరి సెంటిమెంట్ వారికి ఆనందం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.