English | Telugu
ప్రభాస్ ఫ్యాన్స్ టైం స్టార్ట్ అయింది.. ఇది కదా సర్‌ప్రైజ్ అంటే!
Updated : May 16, 2024
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇంతవరకు ఒక్క సాంగ్ కూడా విడుదల చేయకపోవడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అయితే ఇప్పుడు వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న 'కల్కి 2898 AD' ఆడియో రైట్స్ ని సరిగమ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా మేకర్స్.. 15 సెకన్ల మ్యూజిక్ బిట్ ని విడుదల చేశారు. ఆ షార్ట్ మ్యూజిక్ బిట్ అలా విడుదలైందో లేదో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వచ్చింది. అంతేకాదు ఈ వారంలోనే ఈ మూవీ మొదటి సాంగ్ విడుదల కానుందని సమాచారం.