English | Telugu

'RRR'లో బిగ్ మిస్టేక్.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్!

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. మార్చి 25న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది. మే 20 నుంచి ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో వచ్చినట్లే ఓటీటీలోనూ ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే స్థాయిలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి.

సినిమాలోని మిస్టేక్స్ థియేటర్ కంటే ఓటీటీలో ఎక్కువగా పట్టేయొచ్చు. 'ఆర్ఆర్ఆర్'లో ఓ బిగ్ మిస్టేక్ ని కూడా కొందరు అలాగే పట్టేశారు. సినిమాకే హైలైట్ గా నిలిచిన ఇంటర్వెల్ సీన్ లో ఈ మిస్టేక్ ఉండటం విశేషం. భీమ్(తారక్) ఒక వాహనంలో అడవి జంతువులను తీసుకెళ్లి బ్రిటీష్ కోటపై దాడి చేస్తాడు. ఈ సీన్ కి థియేటర్స్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పించేలా ఈ సీన్ ని అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఈ సీన్ లో ఓ బిగ్ మిస్టేక్ ఉంది. ఒకే బోనులో రెండు పులుల్ని, రెండు జింకల్ని ఉంచారు. జింక పులి కంటపడితే ఏమైనా ఉందా?.. వెంటాడి వేటాడి మరీ తినేస్తుంది. అలాంటిది పక్కనే జింకలున్నా పులులు నాన్ వెజ్ మానేసినట్లు ఏం చేయకుండా అలా ఉండటం ఏంటి? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు జక్కన్న? అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ దర్శనమిస్తున్నాయి.

రాజమౌళి ప్రతి సన్నివేశం విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకుంటాడు. అలాంటిది ఈ సన్నివేశంలో ఉన్న మిస్టేక్ ని గమనించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.