English | Telugu

భారతీయుడు 2 ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్ 

యూనివర్సల్ హీరో కమల్ హాసన్(kamal hasaan)ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్(shankar)కలయిక లో ఈ నెల 12 న వరల్డ్ వైడ్ గా విడుదల అయిన మూవీ భారతీయుడు 2 (bharateeyudu 2)విడుదలైన అన్ని చోట్ల భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. మరి ఈ నేపథ్యంలో ఫస్ట్ డే ఏ మేరకు కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.

మొదటి రోజు ఇరవై ఆరు కోట్ల రూపాయలని వసూలు చేసిందనే వార్తలు వస్తున్నాయి. పలు అంతర్జాతీయ పత్రికల కధనం ప్రకారం తమిళంలో 17 కోట్లు, తెలుగులో 7.7 కోట్లు, హిందీ 1.2 కోట్లు. అదే విధంగా ఓవర్ సీస్ కి సంబంధించి నార్త్ అమెరికాలో 1 మిలియన్‌ డాలర్ ఇలా మొత్తం ఇరవై ఆరు కోట్లని అందుకున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ కలెక్షన్స్ కమల్ అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల వారిని విస్మయపరుస్తున్నాయి. నిజానికి మొదటి రోజు 50 కోట్లు దాకా వసూలు చేస్తుందని అందరు భావించారు. కానీ తక్కువ వసూళ్లు రావడంతో అందరు డీలా పడ్డారు.

వాస్తవానికి మొదటి షో నుంచే భారతీయుడు నెగిటివ్ టాక్ ని అందుకున్నాడు. అన్ని ఏరియాల్లోను ఇదే పరిస్థితి. భారతీయుడు ని ఆహ్వానించిన ప్రజలు ఆ తర్వాత భారతీయుడి ని వెళ్లిపొమ్మనడం అనే పాయింట్ తో మూవీ రూపొందింది. కాకపోతే ఈ పాయింట్ సినిమా చివర్లో రావడం వల్ల సినిమా దెబ్బ తిందనే వార్తలు వస్తున్నాయి. ఇదే పాయింట్ తో సినిమా ప్రారంభం అయ్యి ఆ తర్వాత కథని నడిపించి ఉంటే లెక్క వేరేగా ఉండేదని కూడా అంటున్నారు. కమల్ హాసన్ తో పాటు సిద్దార్ధ్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్ర ఖని తదితరులు ముఖ్య పాత్రలని పోషించారు. అనిరుద్ సంగీతాన్ని అందించాడు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.