English | Telugu
బాపు భౌతికకాయం వద్ద ఏడ్చేసిన బాలయ్య
Updated : Sep 2, 2014
ప్రముఖ దర్శకుడు బాపు మృతదేహాన్ని సందర్సించి, నివాళులు అర్పించడానికి ఆయన మలచిన పాత్రల్లో ఒదిగిన సినీ ప్రముఖులు, చిత్రసీమలో ఆయన ఆప్తులు, సన్నిహితులు.. బాపు ఇంటికి తరలి వచ్చారు. ఆయన భౌతిక కాయాన్ని చూసి కంటతడి పెట్టారు. భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఆయనతో అనుబంధాన్ని గద్గద స్వరాలతో గుర్తుచేసుకున్నారు. బాపు చివరి సినిమా శ్రీరామరాజ్యంలో నటించిన బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నారు. కళ్లు చెమ్మగిల్లిన స్థితిలో ఆయన కాసేపు బాపు మృతదేహం వద్ద నించుండిపోయారు.