English | Telugu

జై బాలయ్య అని ఫ్యాన్స్ ఊరకనే అనరు..మరి తక్కువ రెమ్యునరేషన్ ఎందుకు తీసుకుంటున్నాడు

ఒక కొత్త హీరో తన మొదటి సినిమా హిట్ అయితేనే కోట్లు, కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పరిస్థితి.మరి నాలుగు దశాబ్దాలపై నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలని అందిస్తు వస్తున్న నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలి.

బాలయ్య ప్రస్తుతం వాల్తేరు వీరయ్య బాబీ దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం అందరకి తెలిసిందే.ఎన్ బికే 109 పేరుతో తెరకెక్కుతున్న ఆ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఇది కంప్లీట్ అయిన వెంటనే బాలయ్య అఖండ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ మూవీకి ఎంటైర్ తన కెరీర్లోనే ఫస్ట్ టైం ముప్పై కోట్ల రెమ్యునరేషన్ ని బాలయ్య అందుకోబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. నిజానికి బాలయ్య సృష్టించే కలెక్షన్ల సునామీకి ఇది చాలా తక్కువ రెమ్యునరేషన్ అని చెప్పాలి. ఫస్ట్ నుంచి కూడా నిర్మాతల మేలు కోసమే బాలయ్య ఒక మోస్తరు పారితోషకాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఈ రోజు కూడా నాకు ఇంత కావాలని డిమాండ్ చెయ్యడు. అందుకే తన మార్కెట్‌ కంటే తక్కువ పారితోషికం తీసుకునే హీరోల్లో బాలయ్య ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో వంద కోట్లుకి మించి వసూళ్లు సాధించినా కూడా రెమ్యునరేషన్ ని పెంచకుండా పాతిక కోట్లకు లోపే తీసుకుంటున్నాడు.

ఇప్పుడు అఖండ 2 కి ఇచ్చే ముప్పై కోట్లు కూడా నిర్మాతలు తమంతట తాముగా ఇస్తున్నారని తెలుస్తుంది.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వస్తుండంతో బాలయ్య ను చూసి చాలా మంది హీరోలు నేర్చుకోవాల్సి ఉందని, నిర్మాతల మేలును దృష్టిలో పెట్టుకుని పారితోషికాలు తీసుకుంటూ, మరింత మంది నిర్మాతలు తెలుగు పరిశ్రమకి వచ్చి సినిమాలు నిర్మించేలా చూడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా యాభై రోజులు ఆడటానికే గగనమైన ప్రస్తుత రోజుల్లో బాలయ్య సినిమా కొన్ని ఏరియాల్లో సంవత్సరాలకి సంవత్సరాలు ఆడుతున్న విషయం తెలిసిందే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.