English | Telugu

'బాహుబలి' vs 'భజరంగీ భాయ్ జాన్'.. గెలుపెవరిది

ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా రెండు సినిమాల గురించి చర్చలు బాగా జరుగుతున్నాయి. అవి 'బాహుబలి' ఒకటి.. ఇంకొకటి భజరంగీ భాయ్ జాన్. విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలకు స్టోరీ రైటర్ ఒకరే.. అది జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్దు కాసుల వర్షం కురుస్తున్నాయి. ఇంతవరకూ పెద్దగా రాజమౌళి తండ్రి గురించి కొంత మందికి తెలిసినా.. ఇప్పుడు ఈ రెండు సినిమాలతో ఒక్కసారిగా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ 'బాహుబలి' vs 'భజరంగీ భాయ్ జాన్' లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యింది అని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన 'బాహుబలి' మొదటి ఆరు రోజుల్లో 285 కోట్లు సాధించగా 'భజరంగీ భాయీజాన్‌' 169 కోట్లు సాధించింది. ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ కూడా ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఎవ్వ‌రిది పైచేయిగా నిలుస్తుందా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి 'బాహుబలి', 'భజరంగీ భాయీజాన్‌' మూవీల మధ్య పోటీ గట్టిగానే ఉందని సినీ విశ్లోషకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టవుతుందో తెలియదు కానీ.. ఈ సినిమాల వల్ల విజయేంద్ర ప్రసాద్ సూపర్ హిట్టయ్యాడని మాత్రం తెలుస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .