English | Telugu

బాహుబలి రికార్డ్స్: తెలుగులో 75కోట్లు

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాహుబలి' విజువల్‌ ఎక్స్‌లెన్సీ.. అనే టాక్‌ని తొలిరోజు సంపాదించుకున్న విషయం విదితమే. విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో తెలుగు సినిమా సత్తాని చాటింది 'బాహుబలి'. కథ, కథనాల విషయంలో కాస్త బిన్నాభిప్రాయాలున్నా, అవేవీ 'బాహుబలి' వసూళ్ళ ప్రభంజనానికి అడ్డు కాలేదు. లేటెస్ట్ గా ఈ సినిమా తెలుగులో 75కోట్ల షేర్ ను వసూళ్ళు చేసి కొత్త రికార్డ్ దిశగా దూసుకెళ్తోంది. ఈ సినిమా ఏరియా వారి కలెక్షన్లు మీ కోసం తీసుకువచ్చింది తెలుగువన్.

ఏరియా కలెక్షన్లు

నైజాం 28.32 Crores
సీడెడ్ 15.70 Crores
నెల్లూరు 2.87 Crores
గుంటూరు 6.82 Crores
కృష్ణా 4.72 Crores
వెస్ట్ గోదావరి 5.33 Crores
ఈస్ట్ గోదావరి 6.46 Crores
వైజాగ్ 6.49 Crores
మొత్తం 76.71 Crores