English | Telugu

బాహుబ‌లికి రూ.25 కోట్లు అడిగారు!

బాహుబ‌లి... దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా గురించే చ‌ర్చించుకొంటున్నారు. రాజ‌మౌళి మ‌రో అద్భుతం సృష్టిస్తాడ‌ని, ప్ర‌భాస్ ఇర‌గ‌దీయ‌డం ఖాయ‌మ‌ని క‌ల‌లు కంటున్నారు. దక్షిణాదిలోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే బ‌య్య‌ర్లు ఈ సినిమాని ఎంత‌కైనా స‌రే.. కొనేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో రికార్డు ధ‌ర‌కు రేట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు శాటిలైట్ రూపంలోనూ బాహుబ‌లి స‌రికొత్త రికార్డులు సృష్టించే అవ‌కాశం ఉంది. బాహుబ‌లి హ‌క్కుల్ని మాటీవీ సొంతం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఈ హ‌క్కుల‌కు సంబంధించి మాటీవీకీ బాహుబ‌లి టీమ్ కీ సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయి. శాటిలైట్ హ‌క్కుల్ని రూ.25 కోట్ల‌కు అమ్ముతామ‌ని టీమ్ చెబుతోంద‌ట‌. బాహుబ‌లి 1, బాహుబ‌లి 2ల‌కు టోకుగా రూ.25 కోట్ల‌కు అమ్మేస్తార‌న్న‌మాట‌. మా టీవీ రూ.18 కోట్ల‌కు రెండు భాగాల‌నీ సొంతం చేసుకోవాలనిచూస్తోంది. ప్ర‌స్తుతం బేర‌సారాలు జ‌రుగుతున్నాయి. ఏది ఏమైనా బాహుబ‌లి హ‌క్కులు రికార్డు స్థాయికి అమ్ముడుపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.