English | Telugu

బాహుబ‌లి ఫ్లాప్ అట‌.. నిప్పులుగ‌క్కిన జ‌ర్న‌లిస్ట్‌

యు ఏ ఈ సెన్సార్ బోర్డు స‌భ్యురాలిగా ఉంటూ, ఎన్నో సినిమాల‌కు రివ్యూలు రాసి, నికార్స‌యిన ఫ‌లితాల్ని ముందే బ‌య‌ట‌పెట్టిన కైర సంధు అనే ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టు బాహుబ‌లికి అప్పుడే రివ్యూ, రేటింగ్ రెండూ ఇచ్చేసింది. ఐదు స్టార్ల‌కు రెండే స్టార్లు ఇచ్చిన కైరా... ఈ సినిమాని చీల్చిచండాడింది. రానా, ప్ర‌భాస్‌ల‌కు చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, ప‌వ‌న్‌ల‌కు ఉన్నంత స్టామినా లేద‌ని, బాహుబ‌లి ఇండియ‌న్ బిగ్గెస్ట్ మోష‌న్ పిక్చ‌ర్ అంటూ బిల్డ‌ప్పులిచ్చార‌ని, ఆడియ‌న్స్‌కి ఫూల్స్ చేశార‌ని, ఈ సినిమాలో కంటెంట్ లేద‌ని, ఇది బంగారం కాద‌ని, కేవ‌లం రోల్డ్ గోల్డ‌ని.. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో చెడామ‌డా చివాట్లు వేశారు. యు ఏ ఈలో ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు త‌ల‌లు ప‌ట్టుకొన్నార‌ని, ఈ సినిమా చూసి టైమ్‌, టికెట్స్ రెండూ వేస్ట్ చేసుకోవ‌ద్ద‌ని ట్విట్టారు. కాని ... ఈ విశ్లేష‌ణ‌లు అబద్దం కావాల‌ని, బాహుబ‌లి నిజంగానే ఇండియ‌న్ రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లుకొట్టాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకొందాం. ఎందుకంటే.. మ‌న తెలుగు సినిమా. మ‌న‌మంతా గ‌ర్వించే గొప్ప సినిమా. నిజ‌మైన తీర్పు కోసం రేప‌టి వ‌ర‌కూ ఎదురుచూద్దాం. జై.. బాహుబ‌లి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.