English | Telugu

గూస్ బంప్స్ తెప్పించేలా 'BRO' మోషన్ పోస్టర్!

తన మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి స్క్రీన్ పంచుకుంటున్న చిత్రం 'PKSDT'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.

'PKSDT' టైటిల్, ఫస్ట్ లుక్ ని మే 18న సాయంత్రం 4:14 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆ క్షణం కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూశారు. ఇప్పుడు ఆ క్షణం రానే వచ్చింది. ఈ సినిమాకి 'బ్రో' అనే ఆసక్తికరమైన టైటిల్ ను పెట్టారు. కాలాన్ని సూచించేలా ఇంగ్లీష్ అక్షరాలతో డిజైన్ చేసిన టైటిల్ లోగో ఆకట్టుకుంటోంది. ఇక ఈ 'బ్రో' మూవీ మోషన్ పోస్టర్ అయితే కట్టిపడేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో పరమేశ్వరుడి రూపం కనిపిస్తుండగా.. "కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం.. కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం.. బ్రో బ్రోదిన జన్మలేషం.. బ్రో బ్రోవగ ధర్మశేషం.. బ్రో బ్రోచిన కర్మహాసం.. బ్రో బ్రోదర చిద్విలాసం" అనే శ్లోకం వినిపిస్తుండగా.. మెడలో ఓం లాకెట్ ధరించి స్టైలిష్ గాడ్ లా కనిపిస్తున్న కథానాయకుడు పవన్ కళ్యాణ్ రూపాన్ని పరిచయం చేసిన తీరు గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంది.

అలాగే 'బ్రో' చిత్రాన్ని 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ఇంకా పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ మిగిలిన భాగంతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.