English | Telugu

రెచ్చిపోయిన హీరో.. సినిమా పక్కా హిట్ రాసుకోండి!

తమిళ హీరో శివ కార్తికేయన్( sivakarthikeyan)కి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. మూస చిత్రాలకి భిన్నంగా రొటీన్ చిత్రాలు ఆయన నుండి వస్తాయనే పేరు కూడా ప్రేక్షకుల్లో చాలా బలంగా ఉంది. డాక్టర్ ,రెమో,ప్రిన్స్, తో పాటు మొన్న ఈ మధ్య వచ్చిన మహావీరుడు లాంటి సినిమాలే ఉదాహరణ.ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న మరో విన్నూతనమైన మూవీ అయలాన్ (Ayalaan) ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

రీసెంట్ గా అయలాన్ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సాదారణంగా ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఆ మూవీకి ఎలాంటి టాక్ వచ్చినా కూడా ట్రైలర్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉందనే మాటలు వినిపిస్తుంటాయి. కానీ అయలాన్ ట్రైలర్ మాత్రం అంతకు అంత అదిరిపోయిందనే టాక్ ని సంపాదించింది.ఇంకా గట్టిగా చెప్పాలంటే అప్పుడే పుట్టిన పసిపిల్లాడు సైతం సూపర్ గా ఉందనేలా ట్రైలర్ ఉంది. తెలుగుతో పాటు తమిళంలోను రిలీజ్ అయిన ట్రైలర్ ఇప్పుడు రికార్డు స్థాయిలో వ్యూయర్స్ ని సంపాదిస్తు ముందుకు దూసుకుపోతుంది. ట్రైలర్ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. అలాగే సినిమా గ్యారంటీ హిట్ అనే టాక్ ని కూడ అయలాన్ సంపాదించింది. దీంతో శివ కార్తికేయన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు

అయలాన్ కి ఆర్ రవికుమార్ దర్శకత్వం వహించగా ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ (A. R. Rahman) మ్యూజిక్ ని అందించాడు. శివ కార్తికేయన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్(rakul preet singh) కధానాయికగా నటించిన అయలాన్ ని కె జె ఆర్ స్టూడియోస్ పై రాజా, రాజేష్ లు నిర్మించారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.