English | Telugu

వార్-2 ఓటీటీ డీల్.. ఎన్టీఆర్ ప్రభావమేనా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'వార్-2' (War 2). యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా 'వార్'కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న 'వార్-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ అభిమానులను, యాక్షన్ ప్రియులను మెప్పించింది. ఇక ఈ మూవీ ఓటీటీ డీల్ కూడా భారీ ధరకు కుదిరినట్లు తెలుస్తోంది.

సాధారణంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ సినిమాలు ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పుడు 'వార్-2' కోసం మాత్రం నెట్ ఫ్లిక్స్ రంగంలోకి దిగినట్లు సమాచారం. తాజాగా నెట్ ఫ్లిక్స్ "The WaRRR is official" అంటూ 'ఫైటర్' సినిమాలోకి హృతిక్ స్టిల్, 'ఆర్ఆర్ఆర్' లోని ఎన్టీఆర్ స్టిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిని బట్టి 'వార్-2' ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని అర్థమవుతోంది.

హృతిక్ నటించిన పలు సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో ఉన్నాయి. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ఎన్టీఆర్ రీసెంట్ సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ స్థాయిలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దేవర కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అందుకే వార్-2 రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ ఆసక్తి చూపించింది అంటున్నారు. హృతిక్, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా కావడం.. దానికితోడు స్పై యూనివర్స్ హైప్ కూడా ఉండటంతో.. భారీ ధరకు వార్-2 ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని వినికిడి. అయితే హిందీ వెర్షన్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో రానుందా? లేక అన్ని భాషల రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ నే సొంతం చేసుకుందా? అనేది తెలియాల్సి ఉంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.