English | Telugu

'అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌' స్నీక్ పీక్.. కామెరూన్‌ ప్రత్యేక సందేశంతో 'ది వే ఆఫ్ వాటర్' రీ రిలీజ్! 

పాండోరా ప్రపంచానికి మళ్లీ తిరిగి వచ్చిన సందర్భంగా 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' సినిమా మళ్లీ థియేటర్లలో విడుదలవుతోంది. ఈ ప్రత్యేక అవకాశం ప్రేక్షకులకు మరొకసారి జీవితంలో ఎన్నటికీ మరపురాని అనుభవం ఇస్తుంది. జేమ్స్‌ కామెరూన్‌ డైరెక్ట్ చేస్తున్న అసాధారణ ఎపిక్ 'అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌' నుంచి ఇప్పటివరకు ఎవరూ చూడని ఎక్స్‌క్లూసివ్ ప్రివ్యూ ఈ థియేటర్ స్క్రీన్‌లలో ప్రదర్శించబడుతుంది.

సినిమా ప్రారంభానికి ముందు అకాడమీ అవార్డు విజేత డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ నుంచి ప్రత్యేక వ్యక్తిగత సందేశం కూడా ప్రదర్శించబడుతుంది. ఈ సందేశంలో అవతార్ సాగా యొక్క తదుపరి అద్భుత అధ్యాయానికి సంబంధించి, బిహైండ్-ది-సీన్స్ లుక్‌ను అందిస్తారు.

ఈ ఎక్స్‌క్లూసివ్ సీన్, సల్లీ కుటుంబం సహా స్పైడర్‌తో కలిసి విండ్‌ట్రేడర్స్‌కు చెందిన భారీ జెల్లీఫిష్ లాంటి మెడూసాయిడ్స్ అబార్డ్ ప్రయాణం చేస్తున్న సన్నివేశంతో ప్రారంభమవుతుంది. వారిని ట్లాలిమ్ క్లాన్ ముఖ్యుడైన డేవిడ్ థెవ్లిస్ పాత్ర పెయ్‌లాక్ కూడా సాంగత్యం చేస్తాడు. ఈ పాత్ర అవతార్ ఫ్రాంచైజీలో తొలిసారి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ సీక్వెన్స్, జేక్ సల్లీ యొక్క విండ్‌ట్రేడర్స్‌తో కలిసిన కొత్త మిత్రత్వాన్ని ధృవీకరిస్తుంది. అయితే ఈ భాగస్వామ్యం యొక్క పూర్తి స్వభావం, ప్రభావాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి.

ఈ ప్రివ్యూ పాండోరా ప్రపంచంలో మరింత లోతుగా మునిగి తేలే అవకాశాన్ని అందిస్తుంది. అద్భుతమైన విజువల్స్, భావోద్వేగ స్థాయిలు, ఆశ్చర్యకరమైన సీక్వెన్స్‌లతో కూడిన ఈ సన్నివేశాలు, కామెరూన్‌ యొక్క అత్యంత ఆశయపూరిత అధ్యాయానికి మార్గం సుగమం చేస్తాయి.

'అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌' నుంచి ఇదే మొదటి పబ్లిక్ ఫుటేజ్ ప్రదర్శన. ఇది ప్రేక్షకులను సీట్ల ఎడ్జ్ లలో కూర్చునేలా చేయడమే కాకుండా, సినిమా విడుదల పట్ల వారి ఆసక్తిని రెట్టింపు చేయనుంది.

ఈ రీ-రిలీజ్ అక్టోబర్ 2 నుంచి ఒక వారం మాత్రమే ప్రదర్శించబడుతుంది. ఈ అసాధారణ సినిమాటిక్ మూమెంట్‌ను తప్పకుండా చూసి, 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'ను మళ్లీ థియేటర్ స్క్రీన్‌లలో అనుభవించాలని టీం కోరుతోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.