English | Telugu
పవన్ సినిమా మిస్.. బాలయ్య సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ!
Updated : May 10, 2023
పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు'తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సిన బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్.. 'NBK 108'తో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. నిజానికి 'హరిహర వీరమల్లు'లో అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం, డేట్స్ ఇష్యూస్ వంటి కారణాల వల్ల అర్జున్ రాంపాల్ స్థానంలోకి మరో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ వచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు అర్జున్ రాంపాల్ టాలీవుడ్ ఎంట్రీ 'NBK 108'తో ఖరారైంది.
నందమూరి బాలకృష్ణ తన 108వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం అర్జున్ రాంపాల్ ని రంగంలోకి దింపారు. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదే అర్జున్ రాంపాల్ మొదటి తెలుగు సినిమా కానుంది. బాలీవుడ్ లో రెండు దశాబ్దాలుగా విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రాంపాల్. 'రాక్ ఆన్' చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డుని కూడా అందుకోవడం విశేషం. మరి ఇప్పుడు తెలుగులో ఎలా రాణిస్తాడో చూడాలి.
'NBK 108' నుంచి ఇప్పటికే విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.