English | Telugu

అక్కతో అలా, భార్యతో ఇలా.. అనసూయ మరో సంచలనం!

అనసూయ భరధ్వాజ్ (Anasuya Bharadwaj) ఏ విషయాన్నీ అంత తేలిగ్గా వదిలిపెట్టదు. విషయం ఏదైనా బోల్డ్ గా తన అభిప్రాయం చెప్పేస్తుంది. అందుకే ఆమె సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతూ ఉంటుంది. అలా అని కూడా ఊరుకోదు రివర్స్ అటాక్స్ ఇస్తుంది. 'అర్జున్ రెడ్డి' హీరో విజయ్ దేవరకొండ అన్నా.. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అన్నా.. అనసూయకు ఇష్టం లేదన్న విషయం ఆమె పోస్టులను బట్టి అర్ధమవుతుంది.

రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగకు చురకలు వేసింది అనసూయ. యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ భార్యతో, అక్కతో మాట్లాడిన డైలాగ్స్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసింది అనసూయ... అబ్బాయిలు భార్య విషయంలో ఇలా, అక్క విషయంలో ఇలా ఉంటారు. "మీరు నన్ను హిపోక్రైట్ అంటారా?" మీరు కదా హిపోక్రాట్స్ అనే అర్ధం వచ్చేలా కింద కామెంట్ కూడా పెట్టింది.

యానిమల్ మూవీలో అక్కకు రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు. అదే తన భార్య రష్మికతో మళ్ళీ పెళ్లి చేసుకోకు అని అంటాడు. ఐతే యానిమల్ మూవీ హిట్ ఐపోయింది. ఈ మూవీ పురుషాధిక్య సమాజాన్ని పెంపొందించేదిగా ఉంది అనే టాక్ కూడా వచ్చింది. ఏదేమైనా సందీప్ రెడ్డి వంగ తన మూవీ బెస్ట్ అని ఆయనే కితాబిచ్చుకున్నాడు. అలాగే విజయ్ దేవరకొండతో అనసూయ వివాదం ఇప్పటిది కాదు. 2017లో అర్జున్ మూవీ విడుదల దగ్గర నుంచి కొనసాగుతూనే ఉంది. ఆ మూవీ కంటెంట్, డైలాగ్స్, ముద్దు సన్నివేశాలను అనసూయ తప్పుబట్టింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగకి ఇండైరెక్ట్ గా చురక అంటించింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.