English | Telugu

పవన్ కళ్యాణ్ పేరు చెప్పి లక్షఅరవై వేల రూపాయలు హాంఫట్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)అభిమానులు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)హోస్ట్ గా హిందీలో టెలికాస్ట్ అవుతున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం ని తమ తమ సోషల్ మీడియా అకౌంట్ ల ద్వారా ఫుల్ ప్రమోట్ చేస్తున్నారు. అదేంటి అలా చెయ్యడం ఏంటా అని అనుకుంటున్నారా! అసలు విషయం చూసేద్దాం మరి.

అమితాబ్ బిగ్ స్క్రీన్ పై మాత్రమే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా రకరకాల ప్రోగ్రామ్స్ తో తన సత్తా చాటుతు వస్తున్నాడు.అలాంటి వాటిల్లో కౌన్ బనేగా కరోడ్ పతి(kaun banega crorepati)ఒకటి. ఈ షో కి ఇండియా వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. 2000 వ సంవత్సరంలో మొదలైన ఈ షో ఇప్పుడు సీజన్ 16 లోకి అడుగుపెట్టింది. తాజాగా ఇందులో పాల్గొన్నఒక జంట కి పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్న ఎదురయ్యింది.ఇటీవల దక్షిణాదిలో డిప్యూటీ సీఎం అయ్యిన ఓ స్టార్ ఎవరు అని అమితాబ్ అడిగాడు.

దీంతో ఆ జంట ఆడియెన్స్ పోల్ కి వెళ్ళింది. యాభై శాతం మందికి పైగా పవన్ కళ్యాణ్ పేరునే సెలెక్ట్ చేయడంతో వారు కూడా అదే సమాధానాన్ని ఎంచుకున్నారు. ఫలితంగా లక్ష అరవై వేల రూపాయలని ఆ జంట గెలుచుకుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే సంబంధిత బిట్ ని పవన్ ఫ్యాన్స్ రికార్డ్ చేసి మరి వైరల్ చేస్తున్నారు కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16 ఆగస్ట్ 12, 2024 నుంచి ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి తొమ్మిది గంటలకు సోనీ టీవీలో టెలికాస్ట్ అవుతుంది. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో నాగార్జున, చిరంజీవి,ఎన్టీఆర్ హోస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.