English | Telugu

మెగా ప్రిన్సెస్ కి బంగారు ఊయల పంపిన అంబానీ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. జూన్ 20న హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా కుటుంబంలో సంతోషం నెలకొంది. కాగా ఈరోజు పాప బారసాల వేడుకను ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ప్రత్యేకంగా ఓ బంగారు ఊయలను మెగా ప్రిన్సెస్ కి కానుకగా పంపినట్లు ప్రచారం జరుగుతోంది.

పాప లేదా బాబు ఎవరు పుట్టినా, ఏం పేరు పెట్టాలనేది తాము ముందే నిర్ణయించుకున్నామని రీసెంట్ గా రామ్ చరణ్ చెప్పాడు. పాప పుట్టి నేడు 11వ రోజు కావడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం బారసాల వేడుక చేసి పేరు పెట్టినట్లు తెలుస్తోంది. పాప పేరుని త్వరలోనే రామ్ చరణ్, ఉపాసన దంపతులు అభిమానులతో పంచుకునే అవకాశముంది. ఇదిలా ఉంటే మెగా ప్రిన్సెస్ కోసం కోటి రూపాయల విలువైన బంగారు ఊయలను అంబానీ కానుకగా పంపారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...