English | Telugu

అల్లు అర్జున్ చెయ్యాల్సింది రామ్ పోతినేని చేసాడు 

అల్లు అర్జున్(Allu Arjun)సుకుమార్(Sukumar)కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ ఆర్య(Arya). లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆ ఇద్దరి కెరీర్ కి మంచి స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు(Dil Raju)నిర్మించగా అనురాధ మెహతా,శివబాలాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో వచ్చిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.

దిల్ రాజు ఈ నెల 4 న నితిన్(Nithiin)హీరోగా తెరకెక్కిన తమ్ముడు(Thammudu)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీంతో ప్రమోషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో దిల్ రాజు మాట్లాడుతు 'నా బ్యానర్ లో మొదటి సారి చేసిన చాలా మంది దర్శకులు రిపీట్ అయ్యారు. కానీ సుకుమార్ నా కాంబో మళ్ళీ రిపీట్ కాలేదు. నిజానికి సుకుమార్ ఆర్య మూవీ తర్వాత చేసిన 'జగడం'(Jagadam)మూవీని నా బ్యానర్ లో అల్లు అర్జున్ తోనే అనుకున్నాం. సబ్జెట్ పై చర్చలు జరిగాయి. కానీ అల్లు అర్జున్ కి నాకు స్క్రిప్ట్ కనెక్ట్ కాలేదు. సుకుమార్ అండ్ టీం మాత్రం సబ్జెట్ సూపర్ గా ఉందని వేరే వాళ్ళతో చేస్తామని చెప్పారు. అలా జగడం చెయ్యడం కుదరలేదని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

జగడం మూవీని 'రామ్ పోతినేని'(Ram Pothineni)హీరోగా ఆదిత్య మూవీస్ పతాకంపై ఆదిత్య బాబు నిర్మించడం జరిగింది.ఇషా సహానీ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో కనిపించారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా 2007 లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల దివంగతుడైన ప్రముఖ దర్శకుడు కె ఎస్ రవి కుమార్ చౌదరి(Ks Ravikumar Chowdary)ఈ మూవీలో లడ్డు అనే క్యారక్టర్ లో కనిపించడం విశేషం.


అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.