English | Telugu

అల్లు అర్జున్ అభిమానుల హంగామ..తగ్గేదే లేదా!

సంధ్య థియేటర్ లో జరిగిన రేవతి మరణం విషయంలో అల్లుఅర్జున్(allu arjun)వాదనలు,ప్రభుత్వం యొక్క వాదనలు ఎలా ఉన్నా కూడా రీసెంట్ గా అల్లుఅర్జున్ ఇంటి మీద కొంత మంది రాళ్లు విసరడం కలకలం సృష్టిస్తుంది.దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కారులని అరెస్ట్ చెయ్యడం జరుగగా కోర్టు వాళ్ళకి బెయిల్ ని కూడా ఇవ్వడంజరిగింది.

ఇక అల్లు అర్జున్ అభిమానులు అయితే జరుగుతున్న విషయాలపై చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది.దీంతో బన్నీని లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని ట్విట్టర్ లో #StopCheapPoliticsOnALLUARJUN అంటూ ఇండియా వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు.మరో వైపు అల్లుఅర్జున్ కూడా తన ఇంటి మీద జరిగిన దాడి విషయంలో అభిమానులు సంయనంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా తెలియచేసారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.