English | Telugu

అల్లు అర్జున్‌ ఇంటిపై విద్యార్థుల దాడి.. ఉద్రిక్తంగా అక్కడి వాతావరణం!

సంధ్య థియేటర్‌ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, సంఘాలు ఘటన పట్ల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో దీనిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ జెఎసి ఆధ్వర్యంలో విద్యార్థులు అల్లు అర్జున్‌ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. ఇంటి లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని నినాదాలు చేశారు. ఆమె కుటుంబానికి కోటి రూపాయల సహాయాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు, ఇంటి ఆవరణలోని పూల కుండీలను ధ్వంసం చేశారు. కొందరు ఆకతాయిలు ఇంటిపైకి టమాటాలు విసిరారు. న్యాయం చెయ్యాలి అంటూ నినాదాలు చేశారు. అల్లు అర్జున్‌ నివాసానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.