English | Telugu

నువ్వు మగాడివిరా బుజ్జి 

పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లడం వలనే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయిందని,తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ లో అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు, అనంతరం కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తు కోర్టు తీర్పుని ఇచ్చింది.దీంతో అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకి తరలించారు.

ఇక ఈ మొత్తం ప్రాసెస్ లో, అంటే జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటికి అరెస్ట్ చెయ్యడానికి పోలీసులు వచ్చినప్పట్నుంచి, తిరిగి వాళ్ళతో స్టేషన్ కి వెళ్లే వరకు అల్లు అర్జున్ ముఖంలో ఎక్కడా కూడా ఎలాంటి ఆందోళన కనిపించలేదు.పోలీసులతో వెళ్తున్నప్పుడు తన భార్య స్నేహ రెడ్డికి కూడా దైర్యం చెప్పిన అల్లు అర్జున్, ఆ తర్వాత స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్లి ఆ తర్వాత శిక్ష విధించారని తెలిసినా కూడా అల్లు అర్జున్ ముఖంలో చిరునవ్వు ఏ మాత్రం తగ్గలేదు

దీంతో ఇప్పుడు అల్లు అర్జున్(allu arjun)ఫ్యాన్స్ అందరు కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తు గతంతో పాటు ప్రెజంట్ కూడా చాలా మంది సినీసెలబ్రటీస్ పోలీసులు రాగానే వాదన చెయ్యడం, మీతో నేను ఎందుకు రావాలని వాదన చెయ్యడం లాంటివి చేస్తుంటారు.కానీ మా అల్లుఅర్జున్ మాత్రం ఎలాంటి వాదన చెయ్యకుండా పోలీసులకి సహకరించాడు.మా అల్లు అర్జున్ మగాడంటూ ట్వీట్ చేస్తున్నారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.