English | Telugu

అల్లు అర్జున్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్!

పుష్పతో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్, 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశముంది. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటనే సస్పెన్స్ నెలకొంది. త్వరలోనే ఈ సస్పెన్స్ కి తెర పడనుందని తెలుస్తోంది.

నిజానికి 'పుష్ప-2' తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో సినిమాలు కమిట్ అయ్యాడు అల్లు అర్జున్. అయితే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళిపోయింది. సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ ఊసే లేదు. 'పుష్ప-3' చేయాల్సి ఉంది కానీ, దానికింకా టైం ఉంది. అందుకే బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటనేది పెద్ద మిస్టరీలా మారింది. నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసుకోవడం ఫ్యాన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే కొత్త సంవత్సరం ఆరంభంలో అల్లు అర్జున్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

Also Read: షాకింగ్.. రాజమౌళి లాస్ట్ మూవీ వారణాసి..!

కాగా, బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లు ఫ్యామిలీకి చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనుందట. సౌత్ స్టార్ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడని వినికిడి. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఈసారి అల్లు అర్జున్ ఏ జానర్ సినిమా చేయబోతున్నాడు? వంటి విషయాలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.