English | Telugu

‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ’ సూపరంట

''నా కొత్త సినిమాకు టైటిల్‌ సెలెక్ట్‌ చేయడంలో వేల సంఖ్యలో సినీ అభిమానులు పాలు పంచుకోవడం.. మా సినిమాకు ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ’ అనే ఎక్స్‌లెంట్‌ టైటిల్‌ ఫిక్స్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఫేస్‌బుక్‌ పోస్టింగ్స్‌ మరియు ఈమెయిల్స్‌ ద్వారా జరిగిన పోలింగ్‌లో దాదాపు 80% మంది ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ’ టైటిల్‌కే ఓటేసారు. ఈ సందర్భంగా వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను'' అన్నారు హీరో అల్లరి నరేష్‌.

ఆయన కథానాయకుడిగా ఇ.వి.వి.సత్యనారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న చిత్రానికి ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ’ అనే టైటిల్‌ను ఆడియన్స్‌ పోల్‌ ద్వారా ఖరారు చేశారు. అల్లరి నరేష్‌ సరసన ‘సుడిగాడు’ ఫేం మోనాల్‌ గజ్జర్‌ కథానాయకి కాగా.. నరేష్‌కు ట్విన్‌ సిస్టర్‌గా ‘రంగం’ ఫేం కార్తీక నటిస్తోంది. ‘వీడు తేడా’ ఫేం బి.చిన్ని దర్శకుడు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అమ్మిరాజు కానుమల్లి మాట్లాడుతూ... ‘‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ’ చాలా మంచి టైటిల్‌. అల్లరి నరేష్‌కు ఇది యాప్ట్‌. చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈనెలాఖరుకు ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను విడుదల చేసి, సెప్టెంబర్‌ మొదటి వారంలో ఆడియో రిలీజ్‌ చేస్తాం. సెప్టెంబర్‌ రెండో వారంలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

హర్షవర్ధన్‌ రాణె, బ్రహ్మానందం, ఆలి, జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, వెన్నెల కిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, అభిమన్యు సింగ్‌, కెల్లీ డార్జ్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, సాహిత్యం: భాస్కరభట్ల, ప్రెస్‌ రిలేషన్స్‌: వంశీ` శేఖర్‌, ఎడిటర్‌: గౌతమ్‌రాజు, పోరాటాలు: రామ్‌`లక్ష్మణ్‌, ఛాయాగ్రహణం: విజయ్‌కుమార్‌ అడుసుమిల్లి, కథ: విక్రమ్‌ రాజ్‌, కార్యనిర్వహక నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వర్రావు, నిర్మాత: అమ్మిరాజు కానుమల్లి, స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: బి.చిన్ని!