English | Telugu

నాగార్జునకు బ్లాక్‌బస్టర్‌ స్టొరీ కావాలట..!

నాగార్జున కొడుకు అఖిల్ మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో తెలీదుగానీ, దానికి సంబంధించిన రకరకాల వార్తలు మాత్రం బయటకు వెలువడుతూనే వున్నాయి. ప్రస్తుతం నాగార్జున వీవీ.వినాయక్ తో స్టోరీ చర్చలు జరుపుతున్నట్టు టాలీవుడ్ టాక్. అయితే కథ తనకి వంద శాతం సంతృప్తిని ఇచ్చేవరకు ఈ చిత్రాన్ని మొదలు పెట్టకూడదని నాగార్జున నిర్ణయించుకున్నారు. ఎందుకంటే జోష్‌ చిత్రంతో నాగ చైతన్యని పరిచయం చేయడం మిస్టేక్‌ నాగ్ పలుసార్లు చెప్పారు. అఖిల్ విషయంలో అలా జరగకూడదని నాగ్ కేర్ తీసుకుంటున్నారట. అందుకనే అఖిల్ మూవీ గురించి ఇంతవరకు ప్రకటన చేయలేదట. అఖిల్‌ కి మంచి బ్లాక్‌బస్టర్‌ కథ దొరికిన తరువాతే ఈ చిత్రం సెట్స్‌ మీదకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికోసం వినాయక్ కూడా మంచి కథను రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యాడట.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.