English | Telugu

'అఖండ-2' రిలీజ్ పై కీలక ప్రకటన.. పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కి తెలుగునాట ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం వీరి కాంబోలో 'అఖండ-2' రూపొందుతోంది. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'అఖండ-2'ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ చిత్రం వాయిదా పడుతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ.. తాజాగా నిర్మాతలు ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

'అఖండ-2'ని భారీస్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన భారీ సినిమా కావడంతో.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోంది. అందుకే ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 25న విడుదల చేయలేకపోతున్నామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. ఆలస్యంగా వచ్చినా.. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తామని మేకర్స్ హామీ ఇచ్చారు.

నిజానికి సెప్టెంబర్ 25కి 'అఖండ-2', 'ఓజీ' సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రెండూ ఒకేసారి విడుదలైతే.. థియేటర్లు షేర్ చేసుకోవాలి. కల్లెక్షన్లపై కూడా ప్రభావం పడుతుంది. ఇప్పుడు 'అఖండ-2' పోస్ట్ పోన్ కావడంతో.. 'ఓజీ'కి సోలో రిలీజ్ డేట్ దొరికినట్లే. ఇప్పటికే 'ఓజీ'పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు సోలో రిలీజ్ కూడా తోడైతే.. సరికొత్త రికార్డులు నమోదవుతాయి అనడంలో సందేహం లేదు.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.