English | Telugu

మంచు లక్ష్మి vs జర్నలిస్ట్ మూర్తి.. రంగంలోకి దిగిన హేమ!

రీసెంట్ గా 'దక్ష' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ నటి మంచు లక్ష్మికి ఊహించని ప్రశ్న ఎదురైన సంగతి తెలిసిందే. "50 ఏళ్లకు దగ్గరవుతున్న మీరు.. ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నారు?" అంటూ జర్నలిస్ట్ మూర్తి ప్రశ్నించారు. ఇంటర్వ్యూలోనే ఈ ప్రశ్నపై అసహనం వ్యక్తం చేసిన మంచు లక్ష్మి.. అంతటితో ఈ విషయాన్ని విడిచి పెట్టకుండా.. జర్నలిస్ట్ మూర్తిపై ఫిల్మ్ ఛాంబర్‌కి కూడా ఫిర్యాదు చేశారు. (Manchu Lakshmi)

ఆ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మికి ఎదురైన అనుభవంపై తాజాగా సీనియర్ నటి హేమ స్పందించారు. జర్నలిస్ట్ మూర్తి తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సొంత సిస్టర్ కే ఇలాంటి పరిస్థితి వస్తే.. మిగతా చిన్న ఆర్టిస్ట్ ల పరిస్థితి ఏంటని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. (Actress Hema)

"జర్నలిస్ట్ లు అంటే చదువుకున్నవారు, సంస్కారవంతులు కదా. మరి మీరు అడుగుతున్న ప్రశ్నలేంటి?. మూర్తి గారు.. అసలు ఆ క్వశ్చన్ ఏంటి? బాడీ షేమింగ్ చేస్తారా? ఏది అడగాలి, ఏది అడగకూడదో తెలియదా. సుమ గారు ఒక ఈవెంట్ లో సరదాగా టిఫిన్ ని భోజనంలా చేయకండి అంటేనే.. ఆమెపై ఓ జర్నలిస్ట్ సీరియస్ అయ్యారు కదా. ఆమెతో సారీ కూడా చెప్పించుకున్నారు. మరి మీరు నోటికి ఏదొస్తే అది అడుగుతారా? మూర్తి గారు అలాంటి ప్రశ్న అడిగితే.. మిగతా జర్నలిస్ట్ లు ఎందుకు ఖండించడంలేదు. మంచు లక్ష్మి గారు ఆ ప్రశ్న వల్ల ఇబ్బంది పడితే.. అసలు దానిని ఛానల్ వాళ్ళు ఎలా టెలికాస్ట్ చేస్తారు?. ఇంత జరుగుతుంటే మా అసోసియేషన్ ఎందుకు రియాక్ట్ కావట్లేదు. మా ప్రెసిడెంట్ సిస్టర్ కే ఈ పరిస్థితి అంటే.. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి. మా అసోషియన్, ఫిలిం ఛాంబర్ వెంటనే స్పందించి.. దీనిపై న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాను." అంటూ హేమ ఒక వీడియోను విడుదల చేశారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.