English | Telugu
ఆగడు సీన్స్ పటాస్ లో...??
Updated : Feb 3, 2015
పటాస్ విజయానికి ఓ కారణం... అందులో హిలేరియస్‌కామెడీ వర్కవుట్ అవ్వడమే. మరీముఖ్యంగా ప్రభాస్ శీను, ఫృధ్వీ నడిపిన `పార్థాయ...` అంటూ సాగిన కామెడీ ఈసినిమాకి హైలెట్ అయ్యింది. `పార్థాయ..` అనే సౌండింగ్ ఎప్పుడు విన్నా.. థియేటర్లో జనాలు ఘొల్లుమనేవారు. ఆ కామెడీ అంతగా వర్కవుట్ అయ్యింది. అయితే ఈ సీన్ వెనుక ఉన్న సీక్రెట్ ఒకటి తెలిసింది. ఈ సీక్వెన్స్... ఆగడు కోసం రాసుకొన్నదట. అయితే సీను పండుద్దో లేదో అని ఈ 'పార్థాయ'ని పక్కన పెట్టారు. 'ఆగడు' కొసం చాలామంది రచయితలు పనిచేశారు. కామెడీ ట్రాకులు రాసుకెళ్లారు. అందులో అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు. అయితే పక్కన పెట్టిన సీన్స్‌లో 'పార్థాయ' కూడా ఉంది. ఇప్పుడు ఆ సీక్వెన్స్.. పటాస్ కోసం వాడుకొన్నాడు అనిల్. ఈసినిమాలో మాత్రం బాగా వర్కువుట్ అయ్యింది. ఈ సినిమాని నిలబెట్టేసింది. మహేష్‌కి వర్కువుట్ కాని ఫార్ములా... కల్యాణ్‌రామ్‌కి ఓ హిట్టు తీసుకొచ్చిందన్నమాట.