English | Telugu

'ఆగడు' కలెక్షన్ల పై కన్ఫ్యూజన్.!!

సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఆగడు' భారీ అంచనాలతో విడుదలై గొప్ప టాక్‌ని సొంతం చేసుకోలేకపోయిన మొదటిరోజు మాత్రం కలెక్షన్లలో మంచి దూకుడు చూపించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా మొదటిరోజు రూ.15 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు ఆ జోరును చూపించలేకపోయింది. అయితే ఈ మూవీ వీకెండ్ కలెక్షన్ల పై కన్ఫ్యూజన్ నెలకొంది. ఒకరు 35 కోట్లని, మరొకరు 25 కోట్ల రూపాయలు వసూళ్ళు చేసిందని అంటున్నారు. ట్రేడ్ వర్గాలు 27కోట్ల వరకు వచ్చే అవకాశం వుందని అంటున్నాయి. ఈ వారం మొత్తం గడిస్తే కానీ వసూళ్ళు ఎంతవరకు వచ్చాయో తెలుస్తోందని డిస్ర్టిబ్యూటర్లు చెబుతున్నారు.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.