English | Telugu

రామ్ చరణ్, రాజమౌళిల సంచలనం 'మగధీర'కి 15 ఏళ్ళు!

హీరోగా నటించిన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఆషామాషీ విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కి సొంతం అయ్యేలా చేశాడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli). వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'మగధీర' (Magadheera) 2009 జులై 30న విడుదలై, తెలుగు సినీ రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ సంచలన చిత్రం విడుదలై నేటితో 15 వసంతాలు పూర్తయ్యాయి.

'మగధీర' చిత్రం పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. 17వ శతాబ్దంలో ఒక్కటి కాలేకపోయిన జంట.. 21వ శతాబ్దంలో మళ్ళీ జన్మించి ఎలా ఒక్కటయ్యారు అనే ఆసక్తికర పాయింట్ తో రూపొందింది. ఈ చిత్రం ప్రేక్షకులకు వెండితెర మీద ఓ కొత్త అనుభూతిని పంచింది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే 17వ శతాబ్దపు సన్నివేశాలు కట్టిపడేశాయి. వందమందితో రామ్ చరణ్ తలపడే సన్నివేశం టాలీవుడ్ చరిత్రలోనే బెస్ట్ సీన్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. కాలభైరవగా రామ్ చరణ్ నటవిశ్వరూపం చూపించాడు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు, చరణ్ నటన తోడై.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.

'మగధీర' చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బానర్ లో అల్లు అరవింద్ నిర్మించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దేవ్ గిల్, శ్రీహరి, సునీల్, శరత్ బాబు, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. చిత్ర విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి ఎడిటింగ్ గా కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్ గా ఎస్.రవీందర్ వర్క్ చేశారు. ఉత్తమ నృత్య దర్శకుడు, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఈ చిత్రం జాతీయ అవార్డులను గెలుచుకుంది. అలాగే తొమ్మిది నంది అవార్డులను ఖాతాలో వేసుకుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.