English | Telugu

ర‌వితేజ `ద‌రువు`కి ప‌దేళ్ళు!

మాస్ మ‌హారాజా ర‌వితేజ కొన్ని చిత్రాల్లో ద్విపాత్రాభిన‌యంతో ఆక‌ట్టుకున్నారు. వాటిలో `ద‌రువు` ఒక‌టి. మెగాస్టార్ చిరంజీవి `య‌ముడికి మొగుడు`(1988) స్ఫూర్తితో తెర‌కెక్కిన ఈ ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ కి `శౌర్యం` శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. నేటి అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన అనిల్ రావిపూడి సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు. ఇందులో బుల్లెట్ రాజాగా, హోమ్ మినిస్ట‌ర్ ర‌వీంద్ర‌గా ర‌వితేజ రెండు విభిన్న పాత్ర‌ల్లో ఆక‌ట్టుకోగా.. తాప్సీ క‌థానాయిక‌గా సంద‌డి చేసింది. సీనియ‌ర్ య‌ముడుగా స‌త్య‌నారాయ‌ణ‌, జూనియ‌ర్ య‌ముడుగా ప్ర‌భు, చిత్ర‌గుప్తుడిగా ఎమ్మెస్ నారాయ‌ణ అల‌రించిన ఈ సినిమాలో జ‌య‌సుధ‌, బ్ర‌హ్మానందం, సాయాజీ షిండే, ర‌ఘుబాబు, సుశాంత్ సింగ్, గొల్ల‌పూడి, ధ‌ర్మ‌వ‌రపు సుబ్ర‌మ‌ణ్యం, ఎల్బీ శ్రీ‌రామ్, వెన్నెల కిశోర్, స‌న ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

విజ‌య్ ఆంటోని సంగీత‌మందించిన ఈ చిత్రంలో ``రాజుల‌``, ``ఉసుమ‌ల‌ర‌సే``, ``నిజం చెప్పు``, ``సెక్సీ లేడీ`` త‌దిత‌ర గీతాల‌న్ని అల‌రించాయి. శ్రీ వెంక‌టేశ్వ‌ర ఆర్ట్ ఫిల్మ్స్ ప‌తాకంపై బూరుగ‌ప‌ల్లి శివ‌రామ‌కృష్ణ నిర్మించిన `ద‌రువు`.. 2012 మే 25న విడుద‌లై ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది. నేటితో ఈ చిత్రం ప‌దేళ్ళు పూర్తిచేసుకుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.