English | Telugu

రామానాయుడు నిర్మించిన `తాజ్ మ‌హ‌ల్`కి 27 ఏళ్ళు!

సురేశ్ ప్రొడక్ష‌న్స్ సంస్థ అధినేత‌, మూవీ మొఘ‌ల్ డి. రామానాయుడు ప‌లు జ‌న‌రంజ‌క ప్రేమ‌క‌థా చిత్రాల‌ను నిర్మించారు. వాటిలో `తాజ్ మ‌హ‌ల్` ఒక‌టి. శ్రీ‌కాంత్ కి క‌థానాయ‌కుడిగా మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చిన ఈ సినిమాతోనే ప్ర‌ముఖ‌ గీత ర‌చ‌యిత చంద్ర‌బోస్ అరంగేట్రం చేయ‌డం విశేషం. మ్యూజిక‌ల్ హిట్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామాలో శ్రీ‌కాంత్ కి జంట‌గా మోనికా బేడి, సంఘ‌వి సంద‌డి చేయ‌గా.. శ్రీ‌హ‌రి, రంగ‌నాథ్, కోట శ్రీ‌నివాస‌రావు, నూత‌న్ ప్ర‌సాద్, బ్ర‌హ్మానందం, బాబూ మోహ‌న్, సుధ‌, సుధాక‌ర్, మ‌ల్లికార్జున రావు, అచ్యుత్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఎం. ఎం. శ్రీ‌లేఖ స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందిన పాట‌ల్లో ``మంచుకొండ‌ల్లోని చంద్ర‌మా`` ఎవ‌ర్ గ్రీన్ మెలోడీగా నిల‌వ‌గా.. ``పెళ్ళి పెళ్ళంటూ``, ``సాగిపోయే నీలి మేఘం``, ``ఝుమ్ ఝుమ్ అంటూ``, ``ఓ క‌ల క‌న్న‌ది``, ``చిక్ లుక్ చిక్ లుక్`` అంటూ మొద‌ల‌య్యే గీతాలు కూడా రంజింపజేశాయి. 1995 మే 25న విడుద‌లై మంచి విజ‌యం సాధించిన `తాజ్ మ‌హ‌ల్`.. నేటితో 27 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.