English | Telugu

రష్మి రాసలీలలు.. యువత గుండెల్లో సెగలు


ఏంటా ఎక్స్‌ పోజింగ్‌..? ఏంటా తెగింపు..? అసలు తెలుగు సినిమాల్లో రొమాన్స్‌ ఈ స్థాయికి చేరిందా అనే రేంజ్‌ లో ‘గుంటూర్‌ టాకీస్‌’ లో వేడి రాజేసింది రష్మి. పేరుకు తెలుగమ్మాయి అయిపోయింది గానీ ఈ పాట చూసిన తర్వాత ఎవ్వరూ ఈ భామను తెలుగు హీరోయిన్‌ లా చూడరేమో..! బాలీవుడ్‌ భామలకు ఏ మాత్రం తీసిపోకుండా బికినీలు, లిప్‌ లాక్‌ లతో రెచ్చిపోయింది రష్మి. ‘గుంటూర్ టాకీస్’ వీడియో సాంగ్స్ తో ప్రస్తుతం యువత గుండెల్లో సెగలు పుట్టిస్తున్న రష్మి, ఇంటర్వ్యూలలో కూడా అదే స్థాయి మాటలతో మత్తెక్కిస్తోంది. సినిమాలోని లిప్ లాక్ సన్నివేశాన్ని ప్రస్తావించిన సమయంలో… “సినిమాలో సువర్ణ పాత్ర ముద్దు పెట్టుకున్నట్టే బయట కూడా అందరూ అలాగే ముద్దు పెట్టుకుంటారు, వేరేలా ఇంకొలా పెట్టుకోరు, నాకంటూ ఉన్న వ్యక్తిగత జీవితంలో నేను కూడా అలాగే ఉంటాను, నా రియల్ లైఫ్ లో నేను కూడా ఫుల్ రొమాంటిక్కే” అంటూ చెప్పిన మాటలు రష్మి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లకు పైనే అయినా ఇప్పటి వరకు రష్మికి సరైన బ్రేక్‌ రాలేదు. కానీ అదృష్టం బాగుండి జబర్దస్థ్‌ లో యాంకర్‌ గా సెటిలైపోయింది. అంతే కాకుండా ఆ షోకు రష్మి అందాల విందే హైలైట్‌. ఇక ఇన్నాళ్లూ అవకాశం కోసం చూసిన ఈ భామ ఆ కసి మొత్తం గుంటూర్‌ టాకీస్‌ లో చూపించేసింది. ఇందులో ఏ మాత్రం మొహమాటం లేకుండా హాట్‌ సీన్స్‌ లో నటించేసింది రష్మి. తాను నటిస్తున్నది తెలుగు సినిమాలో అనే విషయం మర్చిపోయి.. హీరో గారితో రొమాన్స్‌ పీక్స్‌ కు తీసుకెళ్లింది రష్మి

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.