English | Telugu
టేక్ యువర్ ఓన్ టైం.. ఫైనల్ గా గెలుపు మాత్రం మాదే
Updated : Jul 29, 2020
ప్రస్తుతానికైతే బీఎస్పీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కలిపి గెహ్లాట్ ప్రభుత్వానికి... మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక్క ఎమ్మెల్యే ఎక్కువ ఉన్నారు. మరోవైపు, గెహ్లాట్ పక్కన ఉన్న ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు సచిన్ పైలట్, బీజేపీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు చేజారినా కాంగ్రెస్ సర్కార్ గల్లంతే. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ సమావేశంలో తన బలాన్ని నిరూపించుకుని, గట్టెక్కాలనే ప్రయత్నంలో గెహ్లాట్ ఉన్నారు. ఐతే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికి మూడు సార్లు గవర్నర్ కు విన్నవించినా ఇంత వరకు ఆయన కనికరించలేదు.
కరోనా నేపథ్యం అని ఒక సారి, ఎమ్మెల్యేలకు కనీసం 21 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలని మరో సారి గవర్నర్ అడ్డుపడ్డారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో గవర్నర్ ను మరో సారి కలిసేందుకు గెహ్లాట్ రాజ్ భవన్ కు వెళుతూ.. అసలు గవర్నర్ కు ఏం కావాలో తెలుసుకునేందుకు తాను రాజ్ భవన్ కు వెళ్తున్నానని మీడియాతో చెప్పారు. కావాలంటే 21 రోజులు కాకపోతే 31 రోజులు తీసుకున్నా పర్వాలేదని... అంతిమ విజయం మాత్రం తమదేనని ఈ సందర్బంగా అయన అన్నారు.