English | Telugu
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వైసీపీ ఎంపీలు
Updated : Jul 2, 2020
కాగా, కొద్దిరోజులుగా రఘురామకృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలతో వైసీపీ అధినాయకత్వం ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. అయితే దానికి సమాధానం ఇవ్వకపోగా, ఆ షోకాజ్ నోటీసునే ప్రశ్నించడం ద్వారా రఘురామకృష్ణంరాజు మరింత ఆజ్యం పోశారు. పార్టీకి దూరం కావాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణంరాజు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతల ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన రఘురామకృష్ణంరాజు.. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి స్పీకర్ ను, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తన వాదనలు వినిపించారు. ఇప్పుడు, వైసీపీ ఎంపీలు స్పీకర్ ను కలవనుండడంతో ఈ అంశం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి ఏర్పడింది.