English | Telugu

ఏపీలో మ‌రో ఎమ్మెల్యేకు క‌రోనా

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా క‌రోనా బారిన‌పడుతున్నారు. తాజాగా మ‌రో ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. శ్రీ‌శైలం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్రపాణి రెడ్డికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. పాజిటివ్‌ గా నిర్ధార‌ణ అయ్యింది.

కాగా, ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు 40వేల మార్క్‌ దాటాయి. కరోనా కేసుల సంఖ్య 40,646 కు చేరుకోగా.. క‌రోనా మరణాల సంఖ్య 534 కి చేరింది.