English | Telugu
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్
Updated : Dec 26, 2020
రాజా సింగ్ వ్యాఖ్యలపై చక్రపాణి రెడ్డి స్పందించారు. రాజాసింగ్ ఎప్పుడంటే అప్పుడు శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధమని అన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని చెప్పిన ఆయన.. ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్ధమా? అని రాజా సింగ్ కు సవాల్ విసిరారు. శ్రీశైలంలో ముస్లింలను వెళ్లగొట్టడానికి తామెవరమని, అక్కడ వాళ్ళు 40 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు. రజాక్ అనే వ్యక్తి నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారని, తొమ్మిది సంవత్సరాల నుంచి మాత్రమే రాజకీయాల్లో ఉన్న తనకు ఆయన బినామీ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఎన్నో దేవాలయాలకు తాను ఆర్థిక సహాయం చేశానని, అలాంటి తనను పట్టుకొని హిందూ ద్రోహిగా ముద్రవేయాలని చూస్తున్నారని చక్రపాణి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.