English | Telugu
జగన్ పై అనర్హత వేటుపై యనమల ఏమన్నారంటే?
Updated : Sep 22, 2025
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయ్ కాట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పరిశీలకులు, రాజ్యాంగ నిపుణులు, అసెంబ్లీ వ్యవహారాలు, నిబంధనలపై అవగాహన ఉన్నవారు అందరూ కూడా జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందే అంటున్నారు. అసెంబ్లీ నింబంధనల మేరకు వరుసగా 60 రోజులు అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంటుందంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ అయితే.. గైర్హాజర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే కాదు.. తదుపరి ఎన్నికలలో పోటీకి అనర్హులుగా కూడా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని న్యాయస్థానాలు ల్చాల్సి ఉందన్నారు. వరుసగా 60 రోజులపాటు సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయవచ్చని రాజ్యాంగ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్న యనమల రామకృష్ణుడు, తదుపరి ఎన్నికలలో వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించే విషయంపై న్యాయస్థానాల అభిప్రాయం తీసుకోవలసి ఉందని చెప్పారు.